నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంచి 21 ప్యాకేజ్ పనులను పూర్తి చేసి నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం లోని ఏడు మండలాలలోని 77 గ్రామాలకు 84,000 ఎకరాల కు సాగునీరు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. వేల్పుర్ భూమయ్య మాట్లాడుతూ 2018లో టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిప్ప ప్రాజెక్టు నీటి కోసం 26 23 వేల కోట్ల రూపాయల అంచన వ్యయంతో 21 ప్యాకేజీ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిందని ఆయన తెలిపారు. 2022 సంవత్సరంలో దీని బడ్జెట్ని 36 50 కోట్లకు పెంచిన నిధులు కేటాయించలేదని, దానితో 21 ప్యాకేజీ పనులు ఆగిపోయాయని ఆయన అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లిన కాలయాపన జరుగుతుందని, అందుకే ఆందోళన చేయవలసి వస్తుందని ఆయన అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని, వెంటనే 2000 కోట్లు కేటాయించి 21 ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యం లేక బోరు బావుల పై ఆధారపడుతున్నారని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వ్యవసాయం చేస్తున్న కష్టాల కౌగిలిలో బంధించబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి సభలో మాట్లాడుతూ 1500 తక్షణం అవసరమని ప్రకటించారు కానీ రెండు వేల కోట్లు నిధులు కేటాయిస్తే పనులు పూర్తి అవుతాయని భూమన్న అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు రైతాంగాన్ని అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒప్పించి 2000 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని ఆయన కోరారు. అన్నదాత అవస్థలతో ఉన్న విషయం పాలకులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పై కొండంత ఆశతో ఉన్నారని, మంచిప్ప 21 ప్యాకేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేల్పురు భూమయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అన్ని పక్షాలను కలుపుకొని ఆందోళన తీవ్రం చేస్తామని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. ఈ ధర్నాలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, బన్సీలాల్ ,దాస్ నగర్ గంగన్న, అర్సపల్లి సాయిలు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
