- నాయకుని పాచిక తారుమారు..
నిజామాబాద్, బతుకమ్మ: చెడపకురా చెడేవు ఇది పెద్దలు చెప్పిన మాట. ఈ సూక్తి విద్యుత్ శాఖలో పని చేసింది. యూనియన్ నాయకుడు అనుకున్నది ఒకటయితే, మరోటి అయ్యింది. ఒకరిని పంపించాలని చూడగా, అది తన సంఘ సభ్యునికి తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. డివిజన్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న ఒకరికి ఇటీవల జరిగిన బదిలీల్లో నిజామాబాదు టౌన్ 1 ఈఆర్ఓ కు స్థానం చలనం జరిగింది. అక్కడ చేరినా .. డివిజన్ లోనే పని చేస్తున్నారు. వృత్తిరీత్యా అటెండర్ అయినప్పటికీ ఉన్నత చదువు ఉండడంతో విరమణ ఉద్యోగుల సర్వీసు పుస్తకాలను సహనంతో వారికి ఇబ్బందులు లేకుండా సరి చేసి పెట్టేవారు. బదిలైన ఇక్కడే ఉండడాన్ని చూసిన ఒక యూనియన్ నాయకునికి కడుపు మంట మొదలయ్యింది. దానిలో భాగంగానే బదిలీ అయిన దగ్గర ఉండాలి గదా ఇక్కడేం పని అంటూ ప్రతిరోజు మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని సహించలేని ఆ ఉద్యోగి బదిలీ చోటుకి వెళ్ళిపోయారు.
తన సంఘ సభ్యునికి ఎసరు…
రెండు నెలలుగా అదే కాంపౌండ్ లో పని చేస్తున్న మరో యూనియన్ ఉద్యోగిని జరిపించి, హూర్రీ ..నేను గెలిచాను అని జబ్బలు చరుచుకున్నాడు ఆ నాయకుడు. అంతలోనే … తను ఊహించనిది జరిగింది. 18 నెలలుగా పని చేస్తున్న తన సంఘ సభ్యున్ని తిరిగి యధాస్థానానికి పంపించడంతో ఆ కాస్త సంతోషం ఆవిరైపోయింది. నిరుడు మే నెలలో తన సంఘ సభ్యున్ని నందిపేట్ నుంచి డివిజన్ కార్యాలయానికి అనధికారికంగా తెప్పించుకున్నాడు. నందిపేట్ వెళ్ళిన అర్టిజన్ ఉద్యోగి తన యూనియన్ నాయకుని చాదస్తపు పని వల్ల తాను బలి అయ్యానని మనస్సులో చివాట్లు పెట్టుకుంటూ వెళ్లిపోయినట్లు కాంపౌండ్ లో చర్చ జరుగుతోంది. చెడపకురా చెడేవు అని కొందరంటుంటే ..ఇంకొందరు పోట్టివాన్ని పోడువాడు కొడితే, పోడువాన్ని దేవుడు కొట్టినట్లు అయిందని ఆ నాయకున్ని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు.
