ఒకరిపై వేటు .. తన సభ్యునికే ఎసరు..

నాయకుని పాచిక తారుమారు.. నిజామాబాద్, బతుకమ్మ: చెడపకురా చెడేవు ఇది పెద్దలు  చెప్పిన మాట. ఈ సూక్తి విద్యుత్ శాఖలో పని చేసింది.  యూనియన్ నాయకుడు  అనుకున్నది ఒకటయితే, మరోటి అయ్యింది. ఒకరిని పంపించాలని చూడగా, అది తన సంఘ  సభ్యునికి తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. డివిజన్ కార్యాలయంలో  అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న ఒకరికి ఇటీవల జరిగిన బదిలీల్లో నిజామాబాదు టౌన్ 1 ఈఆర్ఓ కు స్థానం చలనం జరిగింది. అక్కడ చేరినా .. డివిజన్ లోనే పని చేస్తున్నారు. వృత్తిరీత్యా అటెండర్ అయినప్పటికీ ...