29 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతి లో చేరిన కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ మంగళవారం తెలంగాణ జాగృతి లో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత కండువా కప్పి సంస్థలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్థ ఆశయాలకు, లక్ష్యాలకు అంకితమై పని చేయాలని కల్వకుంట్ల కవిత సూచించారు. తనను సంస్థలోకి ఆహ్వానించిన కవితకు సంపత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయాచితం శ్రీధర్, తెలంగాణ ఫుడ్స్ రాష్ట్ర మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, నరేందర్ యాదవ్, ఈగ సంతోష్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article