గోల్డెన్ జూబ్లీ స్కూల్లో ఏం జరుగుతుంది..?

0 99,108
  • గోల్డెన్ జూబ్లీ ప్రైమరీ (ఉర్దూ) స్కూల్ మూత..?
  • ఉర్దూ మీడియం విద్యార్థులు అడ్మిషన్లు నిల్
  • ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై సాగనంపిన విద్యాశాఖ

What happens at Golden Jubilee School?

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబ్లీ హైస్కూల్ (ఉర్దూ) మీడియంలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేయడం చర్చనీయాంశంగా మారింది.  ఉర్దూ ఎయిడెడ్ పాఠశాలగా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి నగరంలోని మూడు ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలకు ముగ్గురిని (సర్ధుబాటు కోసమని)డిప్యూటేషన్ పై పంపుతూ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉర్దూ మీడియంలో ఒకటవ తరగతి నుంచి  7 వతరగతి వరకు విద్యార్ధులు ఎవరూ చేరడం లేదని అందులో పనిచేస్తున్నముగ్గురు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపి  యూపిఎస్  ఉర్దూ మీడియం పాఠశాలను లాంఛనం చేసిందని చర్చ మొదలైంది.  విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడువక ముందే హై స్కూల్ లో అప్పర్ ప్రైమరీ వరకు అడ్మిషన్లు లేవని అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపడం ఉపాధ్యాయులు ముక్కున వేలేసుకుంటున్నారు. అదే గోల్డెన్ జూబ్లీ పాఠశాలలో 8,9,10 ఉర్ధు మీడియలంలో 65 వరకు, ఇంగ్లీష్ మీడియంలో 550 వరకు విద్యార్ధులు ఉండగా కేవలంలో ఉర్దూ మీడియం ప్రైమరీలో అడ్మిషన్లు లేకపోవడం ఏమిటని చర్చకు కారణమైంది. ఈ నెల 6 నుంచి జరిగిన బడి బాట కార్యక్రమం జరిగిందా విద్యార్ధుల చేరిక సంగతిపై క్లారీటి లేకుండా పోయింది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఖిల్లా రోడ్డులో గోల్డెన్ జూబ్లీ హైస్కూల్ (ఎయిడెడ్ ) ఉంది. అందులో గత ఐదు దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్ధులు చదువుకున్నారు. అక్కడ ఉర్దూ మీడియం చదువుతో చాల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో ఒకనాడు మూడువేల పైచిలుకు విద్యార్ధులు చదవిన పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థులు లేరని ప్రైమరీకి మూతవేయడం పై చర్చ జరుగుతుంది. ఉర్దూ మీడియం పాఠశాలలో బోధనకు విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం 24 మంది ఉపాధ్యాయులను భర్తీ చేసింది.  కొందరు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయగా ప్రస్తుతం అక్కడ ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. అందులో ఇద్దరు ఉపాధ్యాయులు  ఈ యేడాది పదవీ విరమణ చేయనున్నారు. అక్కడ విద్యార్ధులకు ఉచిత విద్యా, ఉచిత మధ్యాహ్న భోజనం అందడంతో గత కొంత కాలంగా అక్కడ విద్యార్ధుల సంఖ్య ప్రభుత్వ స్కూళ్లకు దీటుగా బోధన జరిగింది. అక్కడ విద్యార్ధులు కుడా ఉన్నత పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చాయి. కాని గత కొంతకాలంగా సర్కార్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభం కావడంతో గడ్డుకాలం ప్రారంభమైందని చెబుతున్నారు.

గోల్డెన్ జూబ్లీ పాఠశాలలోని 7 వ తరగతి చదవిన విద్యార్ధులు ప్రమోట్ కాగానే విద్యార్ధులు లేరని కారణం చేత యూపిఎస్ ను మూసివేత దిశగా చర్యలు తీసుకోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత ఏడాది ఏడవ తరగతిలో ఎంతమంది విద్యార్ధులు చదవారు.. ఎంత మంది పాస్ అయ్యారు.. ఎంత మంది హై స్కూల్ లో చేరారు.. అనేదానికి విద్యాశాఖ వద్ద సమాధానం లేదు. ఎందుకంటే ఉర్దూ మీడియం ప్రైమరీలో బోధన చేసిన వారితో ఉర్దూ మీడియం హైస్కూల్ లో బోధనకు పనికిరారని డిప్యూటేషన్ వేసిన విద్యాశాఖ ఎయిడెడ్ లో రిక్రూట్ మెంట్ లేదని ప్రైవేట్ టీచర్ల ద్వార బోధన చేయించడం విశేషం. ఇదిలా ఉండగా గత ఏడాది కాలంగా 7వ తరగతిలో ఉన్న కొద్దిమంది విద్యార్ధుల కోసం 5 గురు ఉపాధ్యాయులు బోధన చేశారని  ప్రతి నెలా వేతనాలు  క్లేయిమ్ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టినట్లు రికార్డులు ఉండటం విశేషం. ఎయిడెడ్ స్కూల్స్ లకు గ్రాంట్ ఇన్ లు వస్తుండగా విద్యార్ధుల వద్ద టీచర్ల కోసమని ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగా ఫీజులు వసూలు చేయడం తప్పు. కాని గోల్డెన్ జూబ్లీ ఉర్దూ మీడియం పాఠశాలలో జరిగిన తప్పిదాలను దాని యాజమాన్యం, ఉపాధ్యాయులు కప్పి పుచ్చగా ఇప్పుడు ముగ్గురు ఉపాద్యాయులను డిప్యూటేషన్ పై పంపి వారు చేసిన తప్పులను, అక్రమాలను సరిచేసినట్లయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా బోధన చేయకుండానే వేతనాలు తీసుకోవడమే కాకుండా, విద్యార్ధులు లేకున్న మధ్యాహ్న భోజనం పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.