26.2 C
Hyderabad
Monday, August 3, 2026

 జిల్లా కలెక్టర్ బదిలీ వెనుక జరిగిందేమిటి?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరు నెలలకే కలెక్టర్ బదిలీ

. . . రాజకీయ కారణాలా?

. . . జిల్లా పై అదిపత్యంలో బదిలీలా

. . . తరువాత అ జిల్లా అధికారి వంతా?

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా జూన్ నెలలో రాజీవ్ గాంధీ హనుమంతు నుంచి బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి ఆరు నెలలు తిరుగకముందే బదిలీ కావడం జిల్లాలో ప్రకంపనలు స`ష్టించింది. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు వేంరెడ్డి నరేందర్ రెడ్డి సూచనలతో నిజామాబాద్ జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన వినయ్ కృష్ణారెడ్డిని ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేమిటని చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఇద్దరే కలెక్టర్లు బదిలీ కాగా ఒకరు వినయ్ కృష్ణారెడ్డి కాగా మరొకరు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని అక్కడి నుంచి నిజామాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయడం గమనార్హం. మంగళవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు రాగా బుధవారం ఇలా త్రిపాఠీ బాధ్యతలు స్వీకరించడం చకచక జరిగిపోయాయి. వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ కు పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఉన్న సమీకరణలు అంతలోనే ఎలా మారాయని చర్చ జరుగుతుంది.

 

What happened behind the transfer of the District Collector?

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఇద్దరు అధికార పార్టీలో ఉద్దండ నేతలు ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సేందే. ఉమ్మడి జిల్లాపై ఎవరికి వారు పట్టునిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడంతో గత కొన్ని రోజులుగా సుదర్శన్ రెడ్డి పాలన వ్యవహరాల్లో అంతగా పట్టించుకోలేదు. కానీ అంతకుముందే ఎమ్మెల్సీగా పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ జిల్లా రాజకీయాల్లో మాత్రం తన మాట నెగ్గాలనే ప్రయత్నాన్ని కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ చైర్మన్లు ఉండగా నలుగురు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే. ఒకే ఒక్కరు కామారెడ్డి వాసి. మొన్నటి వరకు జిల్లాలో కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, చివరకు మున్సిపల్ కమిషనర్లు నియామకం జరుగాలన్నా అంతా మహేష్ కుమార్ గౌడ్ కనుసన్నుల్లోనే జరిగింది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదాతో సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు నియమించడంతో జిల్లా పై ఆయన తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సుదర్శన్ రెడ్డికి చేరువుగా ఉన్నప్పటికీ కలెక్టర్ బదిలీ అయ్యాడన్న చర్చ జరుగుతుంది. జిల్లాలో విజయవంతంగా పంచాయితీ ఎన్నికలను ముగించిన అంతకుముందు ధాన్యం కొనుగోళ్ళు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లోటుపాట్లు లేకుండా సక్సెస్ చేసినా కలెక్టర్ ను జీహెచ్ ఎంసీ అదనపు కమిషనర్ గా బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చర్చ జరుగుతుంది. జిల్లాలో మహిళ కలెక్టర్లు చాలా మంది పని చేశారు. కానీ మొదటిసారి కలెక్టర్ గా నల్గొండ జిల్లాలో పని చేస్తున్న ఇలా త్రిపాఠీని అతిపెద్దగా జిల్లాగా పేరున్న నిజామాబాద్ కు బదిలీ చేయడం వెనుక ఎవరి హస్తం ఉందన్న చర్చ జరుగుతంది. కలెక్టర్ల బదిలీలు వేగంగా జరిగినా విధులలో చేరడం కూడా అంతే స్పీడ్ గా జరుగడం ఉద్యోగ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. వినయ్ కృష్ణారెడ్డి అందరితో కలిసిపోయే క్రమంలో ఆయన బదిలీ ఉద్యోగ,రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చ మొదలైంది.

What happened behind the transfer of the District Collector?


. . . నెక్ట్స్ ఆ జిల్లా అధికారేనా?

ఆరునెలలకే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ కావడంతో నెక్ట్స్ ఎవరి వంతు అనే చర్చ మొదలైంది. జిల్లాలో ప్రధానమైన శాఖకు అధిపతి వ్యవహర శైలితో ఆ శాఖ గాడి తప్పుతుంది. ప్రధానంగా సంబంధిత శాఖలో అధికారులకు జవాబుదారితనం లోపించింది. లంచావతరాలు అందినకాడికి దండుకుంటున్నారు. పొరుగు జిల్లాలో సంబంధిత శాఖ సక్సెస్ రేటు పరిగణలోకి తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఆ శాఖాధిపతి రేషియో అట్టడుగునా ఉంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఉదంతం రాష్ట్రంలోనే తీవ్ర కలకలం రేపింది. అధికారుల అలసత్వం, వ్యవహర శైలి కారణంగానే ఆ ఘటన జరిగిందని, అప్పుడే జిల్లా అధికారిని బదిలీ చేస్తారనే చర్చ జరిగింది. సంబంధిత ఉదంతం జరిగిన ఘటనలో కొందరినీ బదిలీ చేయడం తర్వాత వంతు జిల్లా బాస్ దేననే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా గతేడాది వినాయకచవితి పండుగ సమయంలో జిల్లా కేంద్రంలో ఒక ఘటనలో జిల్లా బాస్ వ్యవహరించిన తీరు అధికార పార్టీలో కలకలం రేపింది. జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం వ్యవహరం తారుమారు కావడంతో ఇప్పుడు జిల్లా బాస్ మార్పు ఖాయమని సంబంధిత శాఖలోనూ చర్చ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రే ఉన్నఫళంగా మార్చిన అధికార నేతలు జిల్లా బాస్ ను ట్రాన్స్ ఫర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల సంబంధిత అధికారి సెలవులో వెళ్లగా ఆయన తిరిగి రాడన్న చర్చ జరిగింది. కానీ ఆయన విధుల్లో చేరిన మరుసటి రోజే జిల్లా పాలన యంత్రాం చూసే కలెక్టర్ ట్రాన్ప్ ఫర్ కావడంతో ఆయన కూడా బదిలీ జరుగుతుందని అది ఎప్పుడైనా కావచ్చని చర్చ మొదలైంది.

More articles

Latest article