29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 130 మంది మందుబాబులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో గతేడాది చివరి రోజు మద్యం సేవించి వాహనాలు నడిపిన 130 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. బుధవారం రాత్రి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈతనిఖీలలో మందు బాబులు భారీగా పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేశామని, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని సీపీ  తెలిపారు.

More articles

Latest article