27.2 C
Hyderabad

అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది?…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్సై

 

. . . రిపోర్టర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వని వైనం

 

. . . సీఐ కార్యాలయానికి వెళ్లిన బాధితులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కొన్ని ఫిర్యాదుల పట్ల ఎస్ ఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైందని, విద్యార్థిని అదృశ్యమైన విషయం గురించి రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తుందని, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటివరకు ఈ కేసును స్థానిక ఎస్ఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. చేసేదేమి లేక ఫిర్యాదు దారులు సీఐ కార్యాలయానికి వెళ్లి తమ గోడును విన్నవించుకున్నారు. అదే విధంగా కొన్ని కేసు విషయాల పై ఎస్సై రిపోర్టర్లకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. దీని వెనుక అంతర్గమేమిటో..అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందోనని అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయం పై జిల్లా పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

 

What actually happens at the police station?

More articles

Latest article