30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రయోగాత్మక పరిశోధనల వైపు మొగ్గు చూపాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉస్మానియా విశ్వ విద్యాలయ అసోసియేట్ ఫ్రొఫెసర్ డా.ఎ.విజయ్ భాస్కర్ రెడ్డి

 

. . . ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శాస్త్రీయ దృక్పథంపై జాతీయ సదస్సు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనల వైపు మొగ్గు చూపాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ. విజయభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ అండ్ బాటనీ విభాగాల ఆధ్వర్యంలో “కెమికల్ అండ్ లైఫ్ సైన్సెస్‌లో వస్తున్న మార్పులు – సవాళ్లు” అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్, సెమినార్ చైర్మన్ డా.ఇ.లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. డి. శశికళ, ఉస్మానియా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ. విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సదస్సులో శశికళ లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక పరిశోధనల ద్వారా మానవ జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరచవచ్చో వివరించారు. మరో రిసోర్స్ పర్సన్, విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కెమికల్ సైన్సెస్‌లో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త ఆవిష్కరణల గురించి లోతైన విశ్లేషణ చేశారు. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలక్ నామా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లైఫ్ సైన్స్ లో గల ఆధునిక పద్ధతుల గురించి వివరించి అందరూ కూడా పరిశోధన వైపు ఆలోచన దృక్పథం ఉండాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు గొప్ప అవకాశమని, సబ్జెక్టు నిపుణులతో చర్చించడం ద్వారా వారిలో శాస్త్రీయ అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ డా.బి.అరుణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.ఎస్.గోదావరి, సెమినార్ కో కన్వీనర్స్ వీ శశిధర్ ఎస్ చంద్రకాంత్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, ఐ క్యు ఏసి సమన్వయకర్త డాక్టర్ వి శంకరయ్య, టిఎస్ కేసి సమన్వయకర్త శివకుమార్, కళాశాల సూపర్నెంట్ వసంత లక్ష్మి, కళాశాల అధ్యాపకులు, వివిధ కళాశాలల నుండి వచ్చిన, అధ్యాపకులు, పరిశోధకులు, కళాశాల, అధ్యాపకేతర బృందం, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

There should be a shift towards experimental research.
There should be a shift towards experimental research.

More articles

Latest article