నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ” టైమ్స్ నౌ” ఆధ్వర్యంలో నిర్వహించిన “టైమ్స్ నెట్ వర్క్ ఇండియా హెల్త్ సమ్మిట్ 2025 “లో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే లో అత్యాధునిక, బెస్ట్ పేషెంట్ సెంట్రిక్ ఆసుపత్రి గా వెల్నెస్ హాస్పిటల్స్ ఎంపికై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతులమీదుగా ఎం.డి లు తాళ్ల సుమన్ గౌడ్ , అసద్ ఖాన్ , వివేకానంద రెడ్డి అవార్డు అందుకున్నారు.ఈ సందర్బంగా గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ వెల్నెస్ హాస్పిటల్స్ బృందాన్ని అభినందించారని వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ తెలిపారు.త్వరలో నిజామాబాద్ లో వెల్నెస్ హాస్పిటల్స్ బ్రాంచ్ ప్రారంభం అవ్వబోతుందని ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తామని బోదు అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
