. . . పనులు పర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరి
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ క్రుషితో రెండు అండర్ పాస్ ల నిర్మాణానికి పునాదులు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ( బ్లాక్ స్పాట్ ) లు గతంలో జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. ప్రధానంగా జాతీయ రహదారి 44 లో రోడ్డు ప్రమాదాలకు నిలయమైన ప్రాంతాల్లో అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. ఈ విషయం పై గత ఎడాది ఎంపి అరవింద్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నిధుల కోసం, పనులు ప్రారంభం కోసం ప్రతిపాదనలు చేశారు. నిజామాబాద్ జిల్లా లో రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు అండర్ పాస్ ల నిర్మాణం చేస్తే జాతీయ రహదారుల ప్రమాదాలు, ప్రాణనష్టం లకు నివారణ కై విన్నవించారు. సోమవారం రాష్ట్రంలో రూ.6100 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి గడ్కరీ హైదరాబాద్ నుంచి శ్రీకారం చుట్టారు .నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సీఎం సి వద్ధ రూ.38 కోట్ల వ్యయంతో, ముప్కాల్ చౌరస్తా వద్ద రూ. 42 కోట్లతో అండర్ పాస్ ల నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కారి పర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హమీలు ఒక్కోక్కటిగా కార్యరూపం దాల్చడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.
