29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు

Must read

📰 Generate e-Paper Clip

మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుందని సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూరుతాయని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని పలు వార్డులలో శనివారం సందర్శించి అధికారులు నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి గడపగడపకు వెళ్లి సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుపేద లబ్ధిదారులకు సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. సర్వే విషయంలో ప్రజలు ఎలాంటి అపోహాలు చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసిపి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంకు సంధ్య దాము, టిపిసిసి డెలిగేట్ గంగా శంకర్, తహసిల్దార్ విటల్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Welfare schemes for beneficiaries based on comprehensive family survey

More articles

Latest article