మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తా
రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ బతుకమ్మ, బాన్సువాడ : మున్నూరుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పేర్కొన్నారు. గురువారం బీర్కూర్ మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాన్సువాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో కాసుల బాలరాజ్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో మున్నూరు కాపు కళ్యాణ మండపాల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రాజకీయపరంగా వెనుకబడ్డారని...