బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎస్సీ వాడ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో గురువారం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏకరూప దుస్తులు, నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ… విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూల్కు హాజరై ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు.