27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర టోర్నమెంట్ లో విజయం సాధిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి

 

. . . సీఎం కప్ కు సెపక్ తక్రా జిల్లా పురుషుల, మహిళల జట్ల ఎంపిక

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సీఎం కప్ కోసం అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని, తప్పకుండ రాష్ట్ర టోర్నమెంట్ లో విజయం సాధిస్తామని జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20, 21 వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి లో జరిగే సీఎం కప్ సెపక్ తక్రా టోర్నమెంట్ కు జిల్లా పురుషుల, మహిళల జట్ల ను గురువారం జిల్లా కేంద్రం లోని కలెక్టర్ మైధానం లో డివైఎస్ఓ పవన్ కుమార్, సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి, ఎంపికల ఇంచార్జ్ గాధరి సంజీవ్ రెడ్డి, మీసాలా ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. పురుషుల జట్టు లో బి. ఉదయ్ కుమార్, పవన్ కళ్యాణ్, రీత్విక్ రెడ్డి, అనీష్ రెడ్డి, చరణ్ తేజ, స్టాండ్ బై గా నిశాంత్, సాయి చరణ్ లను, మహిళా జట్టు లో సి.హెచ్. రిక్కీ రెడ్డి, ఎస్. భవ్య శ్రీ, లక్కీ రెడ్డి, భవ్య శ్రీ, సాన్వి రెడ్డి, స్టాండ్ బై గా కే అనన్య రెడ్డి, జి. అవనిక లను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు.

More articles

Latest article