27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులకు అండగా ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రూరల్ నియోజకవర్గ రైతులకు అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని వాడి, ఒన్నాజీ పేట్, మద్దుల్ తాండ, పెద్ద వాల్గొట్, చీమన్ పల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో పంట  నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. జిల్లాలో దాదాపు 900 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ మంత్రికి తెలియజేస్తామని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించిందని, ప్రస్తుతం ఆ పరిహారాన్ని మరింత పెంచే విధంగా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.

More articles

Latest article