రైతులకు అండగా ఉంటాం

రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రూరల్ నియోజకవర్గ రైతులకు అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని వాడి, ఒన్నాజీ పేట్, మద్దుల్ తాండ, పెద్ద వాల్గొట్, చీమన్ పల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో పంట  నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. జిల్లాలో దాదాపు 900 ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు....