30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సింగరేణిలో అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోంది
  • అవినీతిలో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వాటా
  • రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోంది
  • హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైద్రాబాద్, బతుకమ్మ : సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం… అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించకుంటే మేమే సీబీఐకీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం అని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం) జరిగింది. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం అన్నారు. కాంగ్రెస్ హయంలో సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని , అవినీతిలో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వాటా లు పోందుతున్నారని కవిత ఆరోపించారు. త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • సింగరేణి ఎన్నికలలో ఆ సంఘానికి గెలిచేంతా సీన్ లేదు..

గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు  వాపును చూసి బలుపు అనుకుంటున్నారు… నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంతా సీన్ లేదు అని పరోక్షంగా టిజిబికేఎస్ గురించి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అప్పుడు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఆ పరిస్థితి వచ్చిందని సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోంది అని తెలిపారు. హెచ్ఎంఎస్ జాగృతి సంస్థలు మొత్తం 40  వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయి అని  కార్మిక చట్టాలన్నీ అమలయ్యేలా మనం పోరాటం చేద్దాం అని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ చెప్పారనే టీబీజీకేఎస్ కు ఓటు వేశారు… సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నేను  కార్మికుల సమస్యలపై స్టడీ చేసి కేసీఆర్ తో మాట్లాడి వాటిని పరిష్కరించాను అన్నారు. కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు..

We will file a complaint with the CBI about corruption in Singareni.

సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పుడున్న టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు పోరాటం చేయటం లేదో కార్మికులకు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు. ప్రతిక్షణం కార్మికుల కోసం ఫీల్డ్ లో ఉండి పనిచేసే వారే కార్మిక సంఘం గెలుస్తారు. టీబీజీకేఎస్ నాయకులు అవినీతి చేయొద్దని గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను.. అయినా నాయకులు స్వార్థంతో అవినీతి చేశారు. కార్మిక సంఘాల్లో యువతను ప్రోత్సహించాలని కోరినా పట్టించుకోలేదు. సింగరేణి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. దీని మీద  టీజీబీఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. నిన్నటి దాకా ఉన్న సంఘంపైనే విమర్శలు ఏంటనీ కొందరు అనవచ్చు.. కానీ అక్కడ జరిగిన పరిస్థితులపై కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరముందని అన్నారు. కేసీఆర్ సింగరేణి సంస్థను కన్నబిడ్డలా చూసుకున్నారు.. వారి మార్గంలోనే  హెచ్ఎంఎస్జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయని తెలిపారు.  హెచ్ఎంఎస్, జాగృతి కొత్త కాంబినేషన్… అదే విన్నింగ్ కాంబినేషన్ కాబోతుంది అని కవిత అన్నారు.

We will file a complaint with the CBI about corruption in Singareni.

More articles

Latest article