బతుకమ్మ, బోధన్: బోధన్–నాందేడ్ రహదారిపై సాలూర శివారులో ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు లోని ఆరుగురు యువకులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి బోధన్ రూరల్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
