24 C
Hyderabad
Sunday, August 2, 2026

త్వరలో పనులు పూర్తి చేసి వరద నీటి డ్రైనేజీ ని వినియోగంలోకి తీసుకువస్తాం

Must read

📰 Generate e-Paper Clip

. . . రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

త్వరలోనే వరద నీటి డ్రైనేజీ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు రూరల్ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు కుడివైపున వరద నీటి డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రూ.6 కోట్లు 17 లక్షల నిధులతో మంగళవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. బైపాస్ లహరి హోటల్ ముందు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బైపాస్ రోడ్డుపై వర్షాకాలంలో తరచూ నీరు నిల్వ కావడం, రోడ్డు దెబ్బతినడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, రహదారులు దెబ్బతినకుండా వరద నీటిని కాల్వల ద్వారా సురక్షితంగా తరలించే విధంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరేష్‌తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

We will complete the work soon and put the flood water drainage into use.
We will complete the work soon and put the flood water drainage into use.

More articles

Latest article