బోధన్, బతుకమ్మ :
ప్రజాసమస్యలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొస్తూ విశ్వసనీయతతో ముందుకు సాగుతున్న బతుకమ్మ దినపత్రిక సమాజానికి విశేష సేవలు అందిస్తోందని బోధన్ ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం బోధన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 2026 సంవత్సరానికి సంబంధించిన బతుకమ్మ దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నిష్పక్షపాతమైన, సమగ్రమైన సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ సమాజహితాన్ని కాపాడే పత్రికలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ బోధన్ దినపత్రిక ప్రతినిధి శంకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
