27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

మాచారెడ్డి, బతుకమ్మ : రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేస్తోందని, పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మాచారెడ్డి మండలం లక్ష్మీ రావులపల్లి గ్రామంలో  మహిళా సమైక్య ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్నిగురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల రైతులు విని యోగించుకోవాలని  కోరారు.  రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని అన్నారు. సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బం దులు కలుగనీయకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు గన్ని సంచుల కొరత, ఇతరత్రా సమస్యలు  లేకుండా ప్రభుత్వం చూస్తుంది అన్నారు.  ఈ కొనుగోలు కేంద్రాలను రైతుల ప్రయోనం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

We will buy every grain that is harvested.

More articles

Latest article