27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మేం మీడియా మమ్మల్నీ ఎవ్వరు ఏమి చేయలేరూ..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాణిక్ బండార్ గ్రామంలో మహిళలపై ఇద్దరు సోదరుల అరాచకం

 

. . . మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం

 

. . . పోలీస్ కమీషనర్ కార్యాలయం కు తరలివచ్చిన గ్రామస్థులు

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

నిజామాబాద్ నగర శివారులోని మాణిక్ బండార్ గ్రామంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇద్దరు అన్నదమ్ములు మీడియా పేరు చెప్పి దాష్టీకాలకు తెగబడ్డారు. తాము మీడియాలో పనిచేస్తున్నామని మహిళలు స్నానాలు చేస్తున్నప్పుడు వీడియోలు తీసీ లొంగదిసుకునే ప్రయత్నం చేశారని గ్రామస్ధులు ఆరోపించారు. ఇంట్లో క్షుధ్రపూజలు చేయడమే కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని తమ వేనుకు ఉన్నది ఎవ్వరో తెలుసుకోవాలని నేరుగా బేదిరిస్తున్నారని గ్రామస్ధులు వాపోయారు. స్థానిక మాక్లూర్ పోలిస్ స్టేషన్ లో ఒ వివాహిత లిఖితపూర్వకంగా పిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలొ ఒక మహీళను లొంగదిసుకునేందుకు పాత కేసు తిరగతోడిస్తామని ఇద్ధరు అన్నదమ్ములు చేస్తున్న ఆక్రుత్యాలపై , మహిళపై చేస్తున్న వేదింపులు, క్షుద్రపూజలనుంచి తమను రక్షించాలని గ్రామస్ధులు ముకుమ్మడిగా నిజామాబాద్ పోలిస్ కమీషనర్ కార్యాలయంకు తరలివచ్చారు. ఈ విషయంపై నేరుగా పోలిస్ కమీషనర్ కు లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలిస్ కమీషనర్ స్వయంగా విచారణ జరిపి మీడియా ముసుగులో ఆరాచాకాలు చేస్తున్న ఇద్ధరు అన్నధమ్ములపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.

More articles

Latest article