25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సంపూర్ణ మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యుత్ ఆర్టిజన్ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహించి గత్యంతరం లేక సమ్మెలో దిగారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి డిమాండ్లను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల జేఏసీ తరపున జరుగుతున్న సమ్మె శిబిరానికి ఆయన మద్దతు ప్రకటించి గురువారం సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎదురుచూసిన విద్యుత్ కార్మికుల ఆశలు గత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న గత ప్రభుత్వాల మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కార్మికులు అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో వివిధ యూనియన్ లుగా ఉన్న అన్ని విభాగాల కార్మికులు జేఏసీగా ఏర్పడి ఐక్య పోరాటాలకు పూనుకున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేని యెడల ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నలవాల నరసయ్య, నరేష్, తిరుపతి, మురళి, గంగాధర్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More articles

Latest article