24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

బతుకమ్మ భిక్కనూరు :  తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.  భిక్కనూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కు తాటిపత్రీలు, ప్యాడి క్లియర్ యంత్రాలు, తేమ మిషన్ లను రాష్ట్ర బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ  రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వామి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article