సర్పంచ్ ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

0 1,411

బతుకమ్మ,మోర్తాడ్: తమ పదవి కాలంలో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసిన పనులకు బిల్లులు కోసం అధికారులు ఆఫీసుల చుట్టూ నెలల తరబడి చెప్పులరిగేలా తిరిగి తిరిగి విసిగిపోయి చివరకు సోమవారం ప్రభుత్వం బిల్లు లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని చలోహైదరాబాద్ కార్యక్రమం చేపడితే ఈ ప్రభుత్వం పోలీసులులతో తమని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండింస్తున్నామని మోర్తాడ్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ధరణి ఆనంద్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తాము ప్రభుత్వంను అడిగితే అక్రమ అరెస్టు లు ఏంది అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బిల్లులు మంజూరులో జాప్యం జరుగుతోందని దీనితో సర్పంచ్ లుగా తాము అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాక ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమబాధను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. అరెస్టయిన వారిలో సర్పంచ్ లు మోర్తాడ్ ,భోగ ధరణి ఆనంద్, షెట్పల్లి బద్దం గంగారేడ్డి, సుంకేట్ కడారి శ్రీనివాస్, పాలెం ఏనుగు సంతోష్ రెడ్డి, ధర్మోరా మండల రాజేశ్వర్, తిమ్మాపూర్ గడ్డం చిన్నారెడ్డి, వడ్యాట్ రవీందర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.