ఆర్మూర్, బతుకమ్మ : సిపిఎం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తవుతుందని ఎన్నికల ముందు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు కానీ నేటికీ మహిళలకు 2500,ఇవ్వటం లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కూలీలందరికీ 12 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అన్నారు వారికి ఇవ్వడం లేదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలను గుర్తించి వారందరికీ కూడా పంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్టలలో 9 సంత్సరం లు గా గుడిసెలు వేసుకున్న నిరుపేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ పెంచాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు తొగటి భువనేశ్వర్, సిపిఎం సభ్యులు కుల్దీప్ శర్మ, ఓంకార్, కళ్ళు బాయ్, గంగామణి, వెంకటనారాయణ, సాజిద్ ఖాన్, గణేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.