నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

0 8,151

 

. . . బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ “మేడే” దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జరిగిన మేడే జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1886లో అమెరికాలో చికాగో నగరంలో చట్టబద్ధమైన హక్కుల కోసం జరిగిన కార్మికుల ఉద్యమంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన స్పూర్తితో ప్రారంభమైందన్నారు. 1884లో భారతదేశంలో ముంబై కేంద్రంగా భారత కార్మికోద్యమ నిర్మాత నారాయణ మేఘాజీ లోఖాండే నాయకత్వంలో 8 గంటల పని విధానాలు, ఆదివారం సెలవు దినాల కోసం 8 సంవత్సరాల పాటు ఉద్యమించిన ఫలితంగా ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం ఆదివారం సెలవు దినాలు పొందుతున్నారని దండి వెంకట్ తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బిఎల్ టీయూ జెండాను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజన శ్రామిక మహిళల శ్రమ దోపిడి చేస్తున్నాయని అన్నారు.

 

We should mobilize against the four labor codes.

 

పని ప్రదేశాల్లో బహుజన శ్రామిక వర్గ మహిళలపై మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారని వాటిని అరికట్టడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. బిఎల్ టీయూ ఆధ్వర్యంలో నగరంలో 20 ప్రాంతాల్లో మేడే జెండా ఆవిష్కరణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బిఎల్ టీయూ జిల్లా అధ్యక్షులు కాంబ్లె మధు, ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు యాటల అనిల్, టి‌.రాజ్ కుమార్, శ్రీశైలం, నగర నాయకులు హైమద్ ఉసేన్, నవీన్, సాయిలు, మోహన్ గౌడ్, గంగా, రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.