24.1 C
Hyderabad
Monday, August 3, 2026

విప్లవ వీరుల ఆశయ సాధనలో పయనించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విప్లవ వీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖుదేవుల ఆశయ సాధనలో నేటి యువత పయనించాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. నిజామాబాద్ నగరంలో భగత్ సింగ్, రాజు గురు సుకుదేవుల 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూనూగు మీసాల అతి చిన్న వయసులోనే  బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్ పై బాంబుల వర్షం కురిపించిన వీరుడు షాహిద్ భగత్ సింగ్ అని తెలిపారు.  బ్రిటిష్ ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి విప్లవ బాటలో పయనించాలని నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యాడని తెలిపారు. ఉరికొయ్యలను సైతం చిరునవ్వుతో ముద్దాడుతూ ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా  ఉరి కంభం ఎక్కాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఐ(యు) మండల నాయకులు కామ్రేడ్ తుడుం అశోక్, ఏఐఎఫ్డీవై జిల్లా నాయకులు దేవులపల్లి తేజ, గుండా అశోక్, మంగారం ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article