26.2 C
Hyderabad

గొప్ప త్యాగజీవి భగత్ సింగ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో గురుకుల హాస్టల్ లో సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ పార్టీ  ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈసందర్బంగా సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్. జిల్లా నాయకులు  జి.కిషన్  మాట్లాడుతు  బ్రిటిష్ సామ్రాజ్యవాదులు  భారతదేశాన్ని  ఆర్థిక దోపిడికి గురి చేసింది కాక  రాజకీయంగా సాంఘికంగా ప్రజల్ని నిలువు దోపిడీ చేశారన్నారు. బాల్యం నుండే భగత్ సింగ్  విప్లవ స్ఫూర్తిని తీసుకొని  తన నిండు జీవితాన్ని దేశం కోసం ఇచ్చిన గొప్ప త్యాగజీవి అన్నారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, పేదరికం విలయతాండవం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తుందన్నారు. ప్రజల్ని ఆలోచించకుండా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ జిల్లా  నాయకులు ఎస్.సురేష్,  వి.సత్తెమ్మ, మోర్తాడ్ గురుకుల పాఠశాల హాస్టల్ టీచర్స్ అండ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article