26.3 C
Hyderabad
Monday, August 3, 2026

‘లైఫ్’ ఆస్పత్రి ఆధ్వర్యంలో ధన్వంతరి విజయయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

. కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ లో ఉచిత వైద్య శిబిరం

కమ్మర్ పల్లి, బతుకమ్మ: పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో లైఫ్ ఆస్పత్రి(ఆర్మూర్) ఆధ్వర్యంలో చేపట్టిన ధన్వంతరి విజయయాత్ర కొనసాగుతోంది. మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

క్రిటికల్ కేర్, డయాబెటిక్ నిపుణులు డాక్టర్ భాను రామగిరి, న్యురాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, స్ర్తీ వైద్య నిపుణులు స్రవంతి రెడ్డి ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యశిబిరానికి ఉప్లూర్ గ్రామస్తులతోపాటు నల్లూర్, డబ్బా, నాగాపూర్ తదితర గ్రామాల ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లైఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

ధన్వంతరి విజయాత్రకు సహకరించిన వీడీసీ చైర్మన్ సోమ దశరథ్, బద్దం రమేశ్ రెడ్డి, ఎనడ్ల మురళీరెడ్డి, నందగిరి దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, బద్ధం చిన్నారెడ్డి, రేగుంట దేవేందర్, బోనగిరి లక్ష్మణ్, ఆయా గ్రామాల ప్రజలకు లైఫ్ ఆస్పత్రి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Dhanvantari Vijaya Yatra under the auspices of ‘Life’ Hospital

More articles

Latest article