23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ ఓబీసీ మహాసభ ని విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ సభ కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 11వ జాతీయ ఓబీసీ మహాసభను బెంగళూరులో నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 80 కోట్ల మంది ఓబీసీల సమస్యల పరిష్కారం, వారి రాజకీయ సాధికారతే ఈ మహాసభ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బీసీలందరూ పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ, భారతదేశంలో మండల్ కమిషన్ సిఫార్సుల అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో మహాసభ జరగనుందని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలోని 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ సంఘాలు, నాయకులు, ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, మాడవేడి వినోద్ కుమార్, శ్రీలత, అపర్ణ, చంద్రమోహన్, రిటైర్డ్ ఎంపీడీవో గౌస్ మొహియుద్దీన్, దారం భూమన్న, గంగాధర్, సురేందర్, మహేష్, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article