25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

140 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నాం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ది ప్రజాప్రభుత్వమని డీసీసీ అధ్యక్షులు నగేశ్ రెడ్డి అన్నారు.  శుక్రవారం కాంగ్రెస్ పార్టీ  జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేరువైందన్నారు. దీంతో  కాంగ్రెస్ పార్టీ  మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించారని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా గెలిచిన సర్పంచులకు  అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.  అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ పేరుతో ప్రజల వద్ద కమీషన్లు తీసుకున్నారని నగేష్ రెడ్డి  ఆరోపించారు.  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు రూ. 14 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 84 లక్షల కోట్ల అప్పులోకి  నెట్టిందన్నారు.  గత ప్రభుత్వం చేసిన రుణాలకు వడ్డీలు కడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలో సుమారు 80% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుందన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవాదల్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, మహమ్మద్ ఈసా ,అబ్దుల్ ఎజాజ్ ,సాయికిరణ్, శివ మరియు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article