27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మా వద్ద డబ్బు, డాక్యుమెంట్లు లభించలేదు

Must read

📰 Generate e-Paper Clip

. ప్రముఖ నిర్మాత దిల్ రాజు

. ఐటీ అధికారులను కలిసిన ప్రొడ్యుసర్

హైదరాబాద్, బతుకమ్మ: తమ ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించనప్పుడు అనధికారికంగా దాచిన డబ్బు కానీ డాక్యుమెంట్లు కానీ లభించలేదని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. నాలుగు రోజులపాటు ఐటీ సోదాలు కొనసాగాయన్నారు. సోదాలు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వగా, మంగళవారం దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2008లో తమ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని, 16 సంవత్సరాల తరువాత మళ్లీ దాడులు చేశారన్నారు. తమ బ్యాంక్ అకౌంట్లు, చెక్ బుక్స్ ను తనిఖీ చేశారని రాజు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కు చెందిన దిల్ రాజు సినీ రంగంలో ప్రముఖ నిర్మాతగా ఎదిగిన విషయం తెలిసిందే.

More articles

Latest article