హైదరాబాద్, బతుకమ్మ : షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైంది. ఈఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగుడా ఫ్లై ఓవర్ పై చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ నుంచి నలుగురు స్నేహితులు కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం కారులో వెళ్తుండగా ఈఘటన జరిగింది. ఈప్రమాదంలో ఎలాంటి హని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
