23.5 C
Hyderabad

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పనుల జాప్యంపై అఖిలపక్షం పోరుబాట

All-party coalition takes to the path of protest over delays in Madhavanagar railway bridge works

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దీపావళి తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అఖిలపక్షం ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లా డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ఫోరం చైర్మన్ బొబ్బిలి నర్సయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 18 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యమంలో భాగంగా తొలుత జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని, అనంతరం నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ మెమోరాండాలు సమర్పించాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారం కాకపోతే దీపావళి పండుగ తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు,ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. అవసరమైతే నిజామాబాద్ నగర బంద్‌కు పిలుపునిచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.మాధవనగర్ రైల్వే బ్రిడ్జి సమస్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, నిజామాబాద్ నగర అభివృద్ధి,ప్రజల రవాణా సౌకర్యాలకు సంబంధించిన కీలక సమస్య అని నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమాల స్థాయిని మించిన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా ముందుకు వస్తాయని ప్రతినిధులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఐక్యంగా పోరాడాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన జిల్లా కార్యదర్శి  లక్ష్మీనారాయణ, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు,ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా అధ్యక్షులు కె. మధు, బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింహులు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఆకుల పాపన్న, ఆర్‌ఎస్‌పీ నాయకులు కటారి రాములు, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్ధి రాములు,  బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎనగందుల మురళి, జర్నలిస్టు యూనియన్ నాయకులు నర్సింహులు, గంగాదాస్,ఇతర ప్రజాసంఘాలు,కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొని ప్రసంగించారు.

All-party coalition takes to the path of protest over delays in Madhavanagar railway bridge works

More articles

Latest article