పుస్తెలమ్మి ఇండ్లు కట్టినాం

0 14,554
  • బిల్లులు కోసం రోడ్డెక్కితే రాజకీయమంటారా
  • రెండేళ్లుగా ఎదురుచూస్తున్న కనికరించే వాళ్లే కరువయ్యారంటూ లబ్ధిదారులు ఆవేదన

 

బతుకమ్మ, కోటగిరి: గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు,అధికారుల చుట్టూ డబుల్ బెడ్ రూమ్ బిల్లులకై తిరుగుతు,తెచ్చిన డబ్బులకు మిత్తి కట్టలేక నిస్సహాయతతో నిరీక్షిస్తూ సొలసిన బతుకులకు వెలుగులు రావాలని,కడుపు మండి రోడ్డెక్కిన బిల్లులు ఇవ్వరా అని కోటగిరి గ్రామ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులపై ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోనీ ఏ.ఎస్ ఫంక్ష న్ హాల్ నందు కోటగిరి గ్రామ డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మాట్లాడుతూ.పొలాలు,స్థలాలు,బంగారు నగలు అమ్మి ఇంటి నిర్మాణాలు చేపట్టుకుంటే రెండేళ్లుగా బిల్లులు లేవు.బిల్లుల కోసం హౌసింగ్  ఏ.ఈ. ప్రస్తుత డి.ఈ నాగేశ్వర రావు ఇంటి చుట్టూ తిరిగి అలసిపోయి నేడు దిక్కుతోచని పరిస్థితులలో రోడ్డెక్కాల్సి వచ్చిందనీ ఆవేదన ను వ్యక్తం చేశారు.నాటి స్థానిక ప్రజా ప్రతినిధులు,కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యతనానికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందని.గత రెండేళ్లుగా మా బిల్లుల గురించి ఆలోచించని వారు నేడు మా వైపుగా మాట్లాడే వారిపై బురదజల్లే మాటలు మాట్లాడడం తగదన్నారు.మా బిల్లుల కోసం నెలల తరబడి తిరిగి అలసిపోయి కడుపు మండి అన్ని రాజకీయ పార్టీల నాయకులను సంప్రదించి మా కడు పు మంటను తెలిపితే రాజకీయ నాయకులు ఫోటోల లబ్ధి కోసం డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు లేకుండా నిరసన చేశారని చెప్పడం సిగ్గుచేటని నిలదీశారు.అవ్వ పెట్టదు అడుక్కతిననివ్వదు అన్నట్టుగా వారి వ్యవహారం ఉందనీ విమర్శించారు.నేడు మేము రోడ్డెక్కితే మా ఇండ్ల ఫోటోలు తీపిస్తున్నారు.మా కోసం వచ్చి మాకు అండగా నిలబడ్డా అన్ని రాజకీయ పార్టీలకు మేము రుణపడి ఉంటాం.మా బిల్లులు వచ్చేవరకు ఈ ఆందోళనలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు.మేము హౌసింగ్ ఏ.ఈ నాగేశ్వరరావు ఇంటికి వెళితే వారు ఇంట్లో ఉండి కూడా లేరని చెబుతారు. అలాంటి అధికారి మంచి అధికారి అని,పనిచేసే అధికారి అని సంబంధిత ప్రజాప్రతినిధులు పొగడడం విడ్డూరంగా ఉందన్నారు.మేజర్ గ్రామమైన కోటగిరికి ఎన్ని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి.అందులో ఎంతమందికి ఎన్నెన్ని బిల్లులు ఇచ్చారనే విషయాలన్నీ పూర్తిస్థాయిలో సమాజానికి బహిర్గతం కావాలని వారు డిమాండ్ చేశారు. పొలాలు,ఆస్తులు,భార్యల బంగారు నగలు అమ్ము కొని ఇల్లు కట్టుకున్న మాకు పోచారం శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేసి మిగత బిల్లులు త్వరగా ఇప్పించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.