. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్ లలో గత చాలా రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న నాన్ – బెయిలబుల్ వారెంట్ల సంఖ్యను తగ్గించడానికి నిజామాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. మార్చ్ 20 నుండి మార్చ్ 24 వరకు పోలీస్ కమీషనరేట్ పరిధిలో నాన్- బెయిలబుల్ కేసుల విషయం లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్వహించడం జరిగిందన్నారు. కోర్టులు జారీ చేసిన వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నిందితులను పట్టుకోవాలని సీపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 82, 83 ప్రోసిడింగ్ ప్రకారంగా నేరస్థులకు సంబంధించిన స్థిర ఆస్తులు, చర ఆస్తులను జప్తు చేసుకొనే అవకాశం గలదని, కొద్దిమంది బ్రతుకు తెరువు నిమిత్తము గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిపై ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ కు సంబంధించినటువంటి కేసులలో 3 లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్.బి.డబ్ల్యు లను తగ్గించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఈ నాలుగు రోజులలో మొత్తం 105 కేసులను పరిష్కారం చేయడం జరిగిందన్నారు. వేరే రాష్ట్రాలలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి తొమ్మిది మంది కి ఎన్.బి.డబ్ల్యు ఎగ్జిక్యూషన్ చేశారన్నారు. అదే విధంగా వేరే జిల్లాలలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి నలుగురు నిందితులకు ఎన్.బి.డబ్ల్యూ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగిందన్నారు. కోర్టు విచారణలకు నిందితులు హాజరయ్యేలా చూడటం ద్వారా పాత 55 కేసుల్లో ఎన్.బి.డబ్ల్యూ వారెంట్ లను క్లియర్ చేయడం ద్వారా పెండింగ్ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. క్రైమ్ మీటింగ్‌ల ద్వారా పెండింగ్ వారెంట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్త, గడువులోగా వాటిని పరిష్కరించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.