- కామారెడ్డి ఉద్యమాల గడ్డ
- బీసీ ఆక్రోశ సభలో 42శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి
కామారెడ్డి, బతుకమ్మ: బిసి 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పట్టణంలోని సత్య ఫంక్షన్ హాల్ లో శనివారం బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజ్, బాలరాజ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మేమెంతో మాకు అంత వాటా ఇవ్వాలని, బిసి డిక్లరేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి లో మొట్టమొదటిగా బిసి డెకరేషన్ సభ నిర్వహించడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కామారెడ్డి ఉద్యమాల గడ్డ అని పేర్కొన్నారు. తెలంగాణ గీతం మొట్టమొదటిసారిగా అందెశ్రీ కామారెడ్డి లోనే మొదటగా ఆలపించారని అన్నారు. బీసీ డిక్లరేషన్ చేసి 9షెడ్యూల్ చేర్చాలని ఇకనుండి ఉద్యమం మొదలు పెడుతున్నామని తెలిపారు. బిసి డిక్లరేషన్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజలు మద్దతుగా సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
