28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మీ కోసం మేము సేవాసంస్థ చేయూత

Must read

📰 Generate e-Paper Clip

  •  బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం

 

బతుకమ్మ, నవీపేట్ : అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి మీకోసం మేము సేవాసంస్థ తరుపున 10 వేల ఆర్థిక సహాయం అందించారు. నవీపేట్ మండల కేంద్రంలోని తడగాం కాలోనికి చెందిన బేగారి గంగారం అనే వ్యక్తి బుధవారం రోజున అనారోగ్యంతో  మరణించారు. పేద కుటుంబానికి  మీకోసం మేము సేవా సంస్థ వ్యవస్థాప అధ్యక్షులు రఘుపతి లక్ష్మయ్య, సంస్థ సభ్యులు డాక్టర్  మోహన్ , సూరిబాబు గురువారం నాడు 10 వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకోసం మేము సేవా సంస్థ ద్వారా నవీపేట కేంద్రంలో అనేక పేద కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని, రాబోయే రోజుల్లో సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు మహేష్,మహిపాల్, ధనుంజయ్,గ్రామస్తులు పాల్గొన్నారు

More articles

Latest article