26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వరద కాలువకు నీటి  నిలుపుదల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలు కాగా గురువారం రోజు ప్రాజెక్టులో 1083.20 అడుగులు, 54.292 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత సంవత్సరం ప్రాజెక్టులో ఇదే రోజు 1081.20 అడుగులు, 48.295 టిఎంసిల నీరు ఉంది.

More articles

Latest article