నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది పోద్ధటూరు సదానంధ్ రెడ్డి హైద్రాబాద్ లో ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లికి చెందిన పోద్ధూటురు సదానంద్ (80 ) ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లాకోర్టు లో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులకోసం న్యాయస్థానాలలో పలు సివిల్ దవాలు వేసి విజయం సాధించారు. ఆయన తన పేరుమీదనే ట్రస్ట్ ఎర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను చెపట్టారు. ఆంకాపూర్ లోని అలంబన ఆశ్రమం ఎర్పాటు చేశారు. అదే విధంగా రాజకీయాలలో బిజేపిలో పని చేశారు. 2019 కి ముందు నిజామాబాద్ ఎంపి గా బిజేపి టికేట్ కోసం ప్రయత్నించారు. సినియర్ న్యాయవాది పోద్ధుటూరి సదానంధ్ రెడ్డి మృతికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ గురువారం సంతాపం తెలిపింది. బార్ అధ్యక్షులు మల్లేపుల జగన్మోహన్ గౌడ్ అధ్వర్యంలో సినియర్ న్యాయవాదులు రెండు నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు.

