25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మైనర్ బాలికను వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ పై కేసు

Must read

📰 Generate e-Paper Clip

 

యాదాద్రి భువనగిరి, బతుకమ్మ :

 

అధిక కట్నానికి ఆశ పడి మైనర్ బాలికను వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా మైనర్ బాలికను వివాహం చేసుకుంది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్ ఈ నెల 9 న అనంతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికని రహస్యంగా అర్ధరాత్రి సమయంలో వివాహం చేసుకున్నాడు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన అనిల్ కుమార్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మైనర్ బాలికను బాల్య వివాహం చేసుకున్న నాయిని అనిల్ కుమార్ గౌడ్ పై హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో అనిల్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధిక కట్నం ఆశతో మైనర్ బాలికలను వివాహం చేసుకోవడం పై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

 

Case filed against police constable for marrying minor girl

More articles

Latest article