- ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్
నిజామాబాద్, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేల్ ఉత్సవ్ లో భాగంగా మూడవరోజు వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ను ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకెళుతుందన్నారు. విద్యార్థులంతా దేశం కోసం ధర్మం కోసం కంకణబద్ధులుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు బి శివ,రాష్ట్ర కార్యసమితి సభ్యులు అమృతాచారి యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్,నాయకులు నాగరాజు సమీర్ అక్షయ్ లెనిన్ అజయ్ సతీష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
