26.3 C
Hyderabad
Monday, August 3, 2026

 జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన విపుల్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం గాంధీ భవన్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్,పిసిసి చీఫ్,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  లు పాల్గొన్నారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోర్ యాత్రలో భాగంగా ప్రతి బూత్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను గుర్తించాలి అని అన్నారు…అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు 20 శాతం టిక్కెట్లు ఇవ్వాలని అని కోరిన జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ అక్కడే ఉన్న పిసిసి చీఫ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విక్కి యాదవ్, నరాల నిహార్, వెంకట్ రామారావు,రఘునాథ్ వివిధ అసెంబ్లీల అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్,చరణ్ గౌడ్, మెయిన్ లు తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article