28.8 C
Hyderabad
Monday, August 3, 2026

సమ్మెను పరిష్కరించి కాలేజీల బంద్ ను నివారించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు తలపెట్టిన సమ్మెను పరిష్కరించాలని,  పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్. భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి ప్రైవేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ  కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు  విడుదల చేయకపోవడంతో,  తమ కళాశాలలు  మూసివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయన్నారు.  కాలేజీల బంద్ వల్ల విద్యార్థుల చదువుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు కాలేజీల మధ్య విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల బకాయిలతో విద్యార్థులు చదువులు పూర్తిచేసినా,  ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో పేద మధ్య తరగతి విద్యార్థులు పైచదువులు, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలన్నారు.  పెండింగులో వున్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్,,అరుణ్, హర్షిత్,ఆదిత్య,వంశీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article