27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

స్థానిక ఎన్నికలలో బీజేపీ టికెట్ కోసం అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి

 నిజామాబాద్, బతుకమ్మ :

స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు బిజేపి టేకేట్ కావాలని అన్ని పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని  నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు.బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యకతన సేవా పక్షం జిల్లా కార్యాశాల  శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ …జిల్లాలో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలువదు అని స్వయంగా క్యాడరే ఫోన్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు మాకు బీజేపీ టికెట్ ఇవ్వండి అని మోర పెట్టుకుంటున్నారు. ఇందూరు అన్ని స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంటుంది కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు  ప్రతి రంగంలో బీజేపీ ప్రభుత్వమే కృషి చేస్తోంది. తెలంగాణలో కూడా అదే విధంగా బీజేపీ జెండా ఎగరబోతుంది” అని తెలిపారు.జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ …కార్యకర్తలే పార్టీ బలం. సేవ, సమర్పణ భావంతో ప్రతి ఇంటికి బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలి. సేవా పక్షం లో భాగంగా ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అని అన్నారు.కార్యక్రమంలో పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి,జిల్లా ప్రదాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షలు రాంచందర్, పాలేపు రాజు, నర్సారెడ్డి,జిల్లా, నగర, మండల స్థాయి నాయకులు, పాల్గొన్నారు.

More articles

Latest article