29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

6న నిజామాబాద్ కు విక్టరీ వెంకటేష్

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ లో  ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ గ్రాండ్ గా లాంచ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దిల్ రాజు  సమర్పణలో విక్టరీ వెంకటేష్ నటుడుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  నిర్మించిన  ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ట్రైలర్ జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్  చేస్తున్నట్టు   దేవి సినిమా మేనేజర్ నాగేశ్వర్ రావు, లలితా మహల్ థియేటర్ యజమాని బెజుగం వెంకటేష్, శేఖర్ రెడ్డి, నరాల సుధాకర్, ప్రవీణ్ లు తెలిపారు.  దేవి థీయేటర్ లో శనివారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతు..

Victory Venkatesh to Nizamabad on 6th

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌ బ్లస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచాయని ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ జనవరి6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారని అన్నారు. భారీగా జరిగే ఈ ఈవెంట్ కి సంక్రాంతికి వస్తున్నాం టీం అంతా హాజరు కానుంది అని తెలిపారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ ,తమ్మిరాజు ఎడిటర్ స్క్రీన్ ప్లే: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు అని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుండగా నిజామాబాద్ కు ప్రిరిలిజ్ వేడుకలకు విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి హజరవుతారని  సినిమా అభిమానులు, విక్టరీ వేంకటేష్ ఫ్యాన్స్ పెద్ధ ఎత్తున హజరు కావాలని కోరారు.

Victory Venkatesh to Nizamabad on 6th

More articles

Latest article