నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ 2026 – 27 స్పెషల్ ఫేజ్‌లో భాగంగా ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగుల ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థుల ధృవ పత్రాల పరిశీలన సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎన్సీసీ విభాగానికి చెందిన ఇద్దరు, స్పోర్ట్స్ కోటాకు చెందిన ఆరుగురు, దివ్యాంగుల విభాగానికి చెందిన ఒకరు హాజరై ధృవ పత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల ధృవ పత్రాలను అధికారులు పరిశీలించినట్లు యూనివర్సిటీ దోస్త్ సమన్వయకర్త డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ధృవ పత్రాల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్. నేత, నరేశ్, దిలీప్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
