28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జుక్కల్ ప్రజావాణికి రెండు దరఖాస్తులు మాత్రమే…

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మారుతి మాట్లాడుతూ, ప్రజావాణిలో మొత్తం రెండు దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే, ప్రజావాణికి దరఖాస్తులు సమర్పిస్తున్నప్పటికీ అధికారులు వాటిని సకాలంలో పరిశీలించడం లేదని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును ఎమ్మార్వో స్వయంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలు అలాగే కొనసాగితే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article